పశ్చిమ బెంగాల్‌లో 43 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఆరో దశ పోలింగ్
- బరిలో 306 మంది అభ్యర్థులు
- వారి భవితవ్యాన్ని తేల్చనున్న 1.03 కోట్ల మంది
- ప్రతి ఒక్కరు ఓటేయాలంటూ మోదీ ట్వీట్
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఈ ఉదయం 43 నియోజకవర్గాల్లో ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 306 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 1.03 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
కరోనా నేపథ్యంలో ఓటర్లు వైరస్ బారినపడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. మరోవైపు, గతంలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింస నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆరో దశ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.