కమలహాసన్ పార్టీకి సినీనటుడు నాజర్ భార్య రాజీనామా

  • ఎంఎన్ఎం చెన్నై జోన్ కార్యదర్శిగా ఉన్న కమీలా నాజర్
  • శాసనసభ ఎన్నికలకు ముందే రాజీనామా
  • ఆమోదించిన పార్టీ
  • టికెట్ కేటాయించకపోవడమే కారణం?
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి నటుడు నాజర్ భార్య కమీలా రాజీనామా చేశారు. ఎంఎన్ఎం చెన్నై జోన్ కార్యదర్శిగా ఉన్న ఆమె వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందే ఆమె పార్టీకి దూరం జరిగారు. పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ రాశారు.

తాజాగా, ఆమె రాజీనామాను ఆమోదించినట్టు పార్టీ ప్రధాన కార్యాలయం ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబు ప్రకటించారు. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తొలగించినట్టు పేర్కొన్నారు. గత  లోక్‌సభ ఎన్నికల్లో సౌత్ చెన్నై నుంచి బరిలోకి దిగిన ఆమె ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఎంఎన్ఎం నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా టికెట్ లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్టు చెబుతున్నారు.


More Telugu News