లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదు: మమతా బెనర్జీ  

  • ప్రజలను ఇంట్లో బంధించేందుకు నేను వ్యతిరేకం
  • లాక్ డౌన్ విధిస్తే ప్రజల జీవనోపాధి దెబ్బతింటుంది
  • అందరూ మాస్క్ కచ్చితంగా ధరించండి
కరోనా భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, లాక్ డౌన్లను అమలు చేస్తున్నాయి. ఇక తమ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవకాశమే లేదని చెప్పారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనిపై మమత స్పందిస్తూ... మే 5వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. లాక్ డౌన్ విధిస్తే ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని మమత అన్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ప్రజలను ఇంట్లోనే బంధించేందుకు తాను వ్యతిరేకమని తెలిపారు.


More Telugu News