వారంలోగా 4 లక్షలకు పైగా రెమ్ డిసివిర్ వయల్స్ అందుబాటులోకి వస్తాయి: కేటీఆర్

  • ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపాం
  • రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్ డిసివిర్ అందుబాటులోకి వస్తుంది
  • ఆసుపత్రుల్లో అన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం
కరోనా వైరస్ ట్రీట్మెంట్లో రెమ్ డిసివిర్ ఔషధాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. చికిత్సలో దీన్ని దివ్య ఔషధంగా భావిస్తున్నారు. దీంతో, ఈ ఔషధానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రెమ్ డిసివిర్ ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలతో ఈరోజు చర్చలు జరిపామని ఆయన తెలిపారు. నాలుగు లక్షలకు పైగా రెమ్ డిసివిర్ వయల్స్ వారం రోజుల్లోగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు చేరతాయని చెప్పారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆసుపత్రుల్లో అన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.


More Telugu News