ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో తీర్పుపై బైడెన్ స్పంద‌న‌!

  • చట్టం ముందు అందరూ సమానులే
  • ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ ఈ రోజు తీర్పు వ‌చ్చింది
  • వ్యవస్థలో నిజమైన మార్పు తీసుకురావాలి
ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను దోషిగా తేల్చుతూ అమెరికాలోని న్యాయ‌స్థానం తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పారు. ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ ఈ రోజు వచ్చిన తీర్పు మంచి సందేశాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు.

అయితే, ఇది సరిపోదని, ఇక్కడితోనే మనం ఆగిపోకూడదని, వ్యవస్థలో నిజమైన మార్పు తీసుకురావాలని పేర్కొన్నారు. ఇటువంటి విషాద ఘటనలు తగ్గించేలా మనం తప్పక కృషి చేయాలని సూచించారు. త‌న‌కు శ్వాస ఆడటం లేదంటూ జార్జ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మనం నిత్యం గుర్తుంచుకోవాలని అన్నారు. ఆయ‌న హ‌త్య కేసులో నేడు వ‌చ్చిన‌ తీర్పు అమెరికా న్యాయవ్యవస్థలో గొప్ప ముందడుగని తెలిపారు. తాము జార్జ్‌ ఫ్లాయిడ్‌ పేరిట అర్థవంతమైన పోలీసు సంస్కరణ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు ఆయ‌న వెల్లడించారు.


More Telugu News