యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకాలనూ మట్టుబెడుతున్న కొవాగ్జిన్: ఐసీఎంఆర్

  • డబుల్ మ్యూటెంట్ రకంపై తీవ్ర ప్రభావం చూపుతున్న టీకా
  • ఊపిరితిత్తుల కింది భాగానికి వైరస్ నుంచి రక్షణ
  • టీకా తీసుకున్నా మాస్క్ ధరించడం తప్పనిసరన్న డాక్టర్ కృష్ణా ఎల్లా
కరోనా వైరస్‌లోని కొత్త రకాలను కూడా కొవాగ్జిన్ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. భారత్ బయోటెక్ ఈ టీకా యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లను కూడా విజయవంతంగా అడ్డుకుంటోందని పేర్కొంది. భారత్‌లో ఇటీవల వెలుగుచూసిన డబుల్ మ్యూటెంట్ రకంపైనా ఇది బలంగా పనిచేస్తున్నట్టు తెలిపింది.

భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ.. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే కొవిడ్ వ్యాక్సిన్ ఊపిరితిత్తుల కింది భాగాన్నే వైరస్ నుంచి రక్షిస్తుందని, పైభాగాన్ని కాదని అన్నారు. కాబట్టి టీకా తీసుకున్న తర్వాత శరీరంలోకి వైరస్ ప్రవేశించినా ప్రాణాంతకంగా మారదని వివరించారు. టీకా తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్లు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే, టీకా తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరని నొక్కి చెప్పారు.


More Telugu News