16 ఏళ్లు దాటిన వారికీ టీకా.. అమెరికా సీడీసీ నిర్ణయం
- ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు
- తొలుత 16 ఏళ్లు దాటి అనారోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యం
- శరవేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్
అమెరికాలో ఇకపై 16 ఏళ్లు నిండిన వారికి కూడా కొవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్ణయించింది. అయితే, 16 ఏళ్లు దాటి ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ విషయంలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఇలాంటి వారికి కరోనా వైరస్ సోకితే అనారోగ్య సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అలాస్కా, జార్జియా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఇప్పటికే 16 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేస్తున్నారు. మరోవైపు, అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.