కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాం: భారత్ బయోటెక్
- ఏడాదికి 700 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేస్తామన్న భారత్ బయోటెక్
- హైదరాబాద్, బెంగళూరుల్లో ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచామని వెల్లడి
- భారత్ బయోటెక్ కు రూ. 1,500 కోట్ల అడ్వాన్స్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 700 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసేలా సామర్థ్యాన్ని విస్తరించామని వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరుల్లో ఉన్న ప్లాంట్లలో సామర్థ్యాన్ని పెంచామని తెలిపింది.
మరోవైపు మన దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ కు రూ. 3,000 కోట్లు, భారత్ బయోటెక్ రూ. 1,500 కోట్ల అడ్వాన్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిన్న ఆమోదించింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను సరఫరా చేయడం కోసం అడ్వాన్సుగా నిధులను సమకూర్చింది. ప్రస్తుతం సీరమ్ ఇన్స్టిట్యూట్ నెలకు 60 మిలియన్ డోసుల కోవిషీల్డ్ ను ఉత్పత్తి చేస్తుండగా... భారత్ బయోటెక్ నెలకు 4 మిలియన్ల కోవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేస్తున్నాయి.