రేపటి నుంచి తెలంగాణలో సినిమా థియేటర్ల మూసివేత

  • తెలంగాణలో కరోనా తీవ్రం
  • నైట్ కర్ఫ్యూ ప్రకటించిన సర్కారు
  • కీలక నిర్ణయం తీసుకున్న థియేటర్ ఓనర్ల సంఘం
  • థియేటర్లు, మల్టీప్లెక్సుల స్వచ్ఛంద మూసివేతకు  నిర్ణయం
కొవిడ్ నానాటికీ ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు మూతపడనున్నాయి. ఈ మేరకు సినిమా థియేటర్ల యజమానుల సంఘం నిర్ణయించింది. ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా బుధవారం నుంచి సినిమా ప్రదర్శనలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్టు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది.

తొలుత, రాత్రి 7.30 గంటల వరకే థియేటర్లు పనిచేస్తాయంటూ ప్రచారం జరిగింది. అయితే సినిమా ప్రదర్శనలను పూర్తిగా నిలిపివేయాలని ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కేంద్రం 100 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలకు అనుమతి నిచ్చింది. కొన్ని సినిమాలు కూడా విడుదలై చిత్ర పరిశ్రమ, అనుబంధ వ్యవస్థలు కోలుకుంటున్నాయన్న తరుణంలో కొవిడ్ మరోసారి పంజా విసిరింది.


More Telugu News