కేసీఆర్ ను కరోనా ఏమీ చేయలేదు: మోహన్ బాబు
- కేసీఆర్ పోరాటయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు
- ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు
- కేసీఆర్ నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తన ఫామ్ హౌస్ లో క్వారంటైన్ లో ఉన్న ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. నిపుణులైన వైద్య బృందం ఆయనకు చికిత్సను అందిస్తోంది. కరోనా స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు. మరోవైపు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాజకీయ, సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.
తాజాగా సినీ నటుడు మోహన్ బాబు కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'పోరాటయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు... ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఆయనను కరోనా ఏమీ చేయలేదు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుడుని కోరుకుంటున్నాను' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.