కరోనాతో కన్నుమూసిన సీనియర్ పాత్రికేయుడు అమర్ నాథ్... సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
- కరోనాకు బలైన కోసూరి అమర్ నాథ్
- 10 రోజుల కిందట అమర్ నాథ్ కు కరోనా పాజిటివ్
- నిమ్స్ లో చికిత్స.. ఈ మధ్యాహ్నం కన్నుమూత
- ప్రగాఢ సానుభూతి తెలిసిన కేసీఆర్, జగన్
ప్రముఖ పాత్రికేయుడు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు కోసూరి అమర్ నాథ్ కరోనాతో ప్రాణాలు విడిచారు. ఆయనకు పది రోజుల కిందట కరోనా పాజిటివ్ రాగా, నిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం మృతి చెందారు. అమర్ నాథ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అటు, ఏపీ, తెలంగాణ పాత్రికేయ వర్గాల్లో అమర్ నాథ్ మృతితో విషాదం నెలకొంది. పాత్రికేయుల సమస్యలపై గళం విప్పి, పరిష్కారానికి కృషి చేశారంటూ ఆయనను జర్నలిస్టు సంఘాల నేతలు కీర్తించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా అమర్ నాథ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.