తెలంగాణ, ఏపీలకు వర్ష సూచన!
- మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం
- అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
- కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ఇరు తెలుగు రాష్ట్రాలను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. మండుతున్న ఎండలతో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు, ఇరు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురును అందించింది. మూడు రోజుల్లో రెండు రాష్ట్రాలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది.
సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల నుంచి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రస్తుతం నైరుతి మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించిందని తెలిపింది. ఈ ఆవర్తన ద్రోణి వల్ల అక్కడక్కడ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. కొన్నిచోట్ల వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది.