కరోనా బారిన మరో కేంద్ర మంత్రి

  • దేశంలో కరోనా స్వైరవిహారం
  • కరోనా బాధితుల జాబితాలో రాజకీయ నేతలు
  • తాజాగా కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్ కు పాజిటివ్
  • ఇప్పటికే తొలిడోసు వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి 
కరోనా భూతం దేశంలో అడ్డుఅదుపు లేకుండా పాకిపోతోంది. నేతలు సైతం ఈ మహమ్మారి ప్రభావం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా కేంద్ర సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయనే వెల్లడించారు. కొవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, వైరస్ సోకినట్టు తేలిందని వివరించారు. ఇటీవల తనను ఎవరైనా కలిసుంటే వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని జితేంద్ర సింగ్ సూచించారు.

కాగా, జితేంద్ర సింగ్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సోషల్ మీడియాలో తెలిపారు. జితేంద్ర సింగ్ మార్చి 1న ఢిల్లీలోని ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. రెండో డోసు తీసుకునే లోపే ఆయనకు కరోనా సోకింది.


More Telugu News