కేటీఆర్‌ను కలిసిన బీజేపీ నేతలపై చర్యలకు కమిటీ!
- బీజేపీ నేతలు ప్రగతి భవన్‌కు వెళ్లిన వైనం
- లింగోజిగూడ కార్పొరేటర్ ఎన్నిక ఏకగ్రీవంపై కేటీఆర్‌తో చర్చ
- నిజనిర్ధారణ కమిటీ వేసిన బండి సంజయ్
- నేడు ఆయా నేతలతో కమిటీ చర్చ
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ కార్పొరేటర్ ఎన్నిక ఏకగ్రీవం విషయమై మాట్లాడేందుకు ఇటీవల మంత్రి కేటీఆర్ వద్దకు పలువురు బీజేపీ నేతలు వెళ్లారు. అయితే, పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలు ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలవడంపై బీజేపీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. కేటీఆర్‌ను కలిసి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కేటీఆర్‌ను బీజేపీ నేతలు కలవడంపై నిజనిర్ధారణ కమిటీ వేసి, చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. కేటీఆర్‌ను కలిసిన సమయంలో బండి సంజయ్‌పై సదరు మంత్రి పలు కామెంట్లు చేసినా బీజేపీ నేతలు ఎందుకు ఉపేక్షించారన్న విషయంపై కూడా నిజనిర్ధారణ కమిటీ ఆరా తీయనుంది.
కమిటీని ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కు అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో ఈ రోజు ఆయన దాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఈ కమిటీలో ఉన్నారు.
రెండు రోజుల్లో తనకు రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని బండి సంజయ్ ఆదేశించారు. కేటీఆర్‌తో భేటీ సందర్భంగా ప్రగతి భవన్‌లో ఏమి జరిగిందనే విషయంపై ఈ త్రిసభ్య కమిటీ తేల్చనుంది. ఇప్పటికే రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డిని త్రిసభ్య కమిటీ విచారించింది. అలాగే, ప్రగతి భవన్‌కు వెళ్లిన నేతలతో కాసేపట్లో త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది.