పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచిన ఏపీ ప్రభుత్వం!

  • అంచనాలను రూ. 7,192 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు
  • స్పిల్ వే, పైలట్ ఛానల్ అంచనాలు రూ. 1,600 మేర పెంపు
  • వచ్చే ఏడాదికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు అంచనాలను రూ. 7,192 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ వ్యయాన్ని రూ. 5,535 కోట్లుగా రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ధారించింది. ప్రధాన డ్యామ్ లో భాగమైన ఈసీఆర్ఎఫ్, స్పిల్ వే, పైలట్ ఛానల్ తదితర నిర్మాణాల అంచనాలను మరో రూ. 1,600 కోట్ల మేర పెంచుతూ ఇప్పుడు ఉత్తర్వులను జారీ చేసింది.

మరోవైపు, వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెపుతోంది. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిధులను విడుదల చేయాలంటూ కేంద్రాన్ని కోరుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర పెద్దలతో భేటీ అయి... నిధులను విడుదల చేయాలని కోరారు.


More Telugu News