కొడుకు కంపెనీ కోసం మరో దేశంతో కుమ్మక్కయిన దేశద్రోహి ఏబీ వెంకటేశ్వరరావు: విజయసాయిరెడ్డి
- ఏబీ వెంకటేశ్వరావుపై విజయసాయి ధ్వజం
- ఏబీ ఒక ఫోన్ ట్యాపర్ అంటూ విమర్శలు
- అతని సాక్ష్యానికి విలువేముంటుందని వ్యాఖ్యలు
- ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించాడని ఆరోపణ
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏబీ వెంకటేశ్వరరావు ఓ ఫోన్ ట్యాపర్ అని ఆరోపించారు. దేశం ద్రోహం కేసులో నిందితుడని, కొడుకు కంపెనీ కోసం మరో దేశంతో కుమ్మక్కైన దేశద్రోహి అని అభివర్ణించారు. అతని సాక్ష్యానికి విలువేమీ ఉండదని అన్నారు. సాక్ష్యాలుంటే షాడో హోంమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినవాడా ప్రవర్తన గురించి మాట్లాడేది? అని విమర్శించారు. కాగా, వివేకా హత్య కేసులో సీబీఐకి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాసిన నేపథ్యంలోనే విజయసాయి పైవిధంగా స్పందించినట్టు తెలుస్తోంది. వివేకా హత్య కేసుకు సంబంధించి తన వద్ద పూర్తి సమాచారం ఉందని సీబీఐకి రాసిన లేఖలో ఏబీ పేర్కొన్నారు.