కేసీఆర్ ఒక ఫైటర్.. త్వరగా కోలుకుంటారు: కేటీఆర్
- తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్
- ఐసోలేషన్ లో కేసీఆర్
- కేసీఆర్ కోలుకోవాలంటూ సందేశాలు
- ఆయన చాలా గట్టి మనిషి అంటూ కేటీఆర్ ట్వీట్
- తప్పకుండా కోలుకుంటారని ధీమా
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సీఎం కేసీఆర్ కు స్వల్ప లక్షణాలతో కరోనా నిర్ధారణ అయిందని వెల్లడించారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని వివరించారు.
సీఎం కేసీఆర్ కోలుకోవాలంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయని, అయితే ఆయన చాలా గట్టి వ్యక్తి అని, పోరాట యోధుడు అని కేటీఆర్ అభివర్ణించారు. 'మీ అందరి ప్రార్థనలతో ఆయన త్వరగా కోలుకుంటారని కచ్చితంగా చెప్పగలను' అంటూ ట్వీట్ చేశారు.