భారత్‌ను ‘రెడ్ లిస్ట్’లో పెట్టిన బ్రిటన్
- కరోనా విజృంభణ నేపథ్యంలోనే
- బ్రిటన్‌లోకి అనుమతి నిరాకరణ
- మొత్తం 40 దేశాలు రెడ్ లిస్ట్‌లోకి
- భారత పర్యటన రద్దు చేసుకున్న బోరిస్ జాన్సన్
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. కొవిడ్ విజృంభణ అధికంగా ఉన్న దేశాలను రెడ్ లిస్ట్‌లో చేరుస్తూ వస్తున్న బ్రిటన్ తాజాగా భారత్‌ను కూడా ఆ జాబితాలో చేర్చింది. దీంతో ఆయా దేశాల నుంచి బ్రిటన్‌లోకి ప్రవేశించేందుకు పౌరులకు అనుమతి ఉండదు. ఒకవేళ రెడ్ లిస్ట్ జాబితాలోని దేశాల్లో ఉన్న బ్రిటీష్, ఐరిష్ పౌరులు తిరిగి బ్రిటన్‌కు వెళ్లాలనుకుంటే కచ్చితంగా 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి.
ప్రస్తుతం భారత్‌లో ప్రబలుతున్న కరోనా వేరియంట్ అత్యంత ప్రమాదరకమైందన్న అక్కడి నిపుణుల సూచన మేరకే బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ సహా మొత్తం 40 దేశాలను బ్రిటన్ రెడ్ లిస్ట్‌లో చేర్చింది. అంతకుముందు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు హాంకాంగ్ సైతం భారత విమాన రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది.