బావ ముఖేశ్ అంబానీకి టీనా అంబానీ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు!
- ఇన్‌స్టాగ్రామ్‌లో పాత ఫొటో
- కొన్ని గంటల్లోనే వేలాది లైక్స్
- ముఖేశ్ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి ఆయన సోదరుడు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ముగ్గురు కలిసి ఉన్న ఓ పాత ఫొటోని షేర్ చేస్తూ ముఖేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ముఖేశ్‌ను ప్రేమకుపాత్రుడైన కొడుకుగా, సోదరుడిగా, బావగా ఆమె అభివర్ణించారు. అలాగే ఆరాధించే తండ్రిగా, తాతగా కూడా పేర్కొన్నారు.
ముఖేశ్ కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. ఆమె పెట్టిన ఈ పోస్ట్‌ను కొన్ని గంటల్లోనే వేలాది మంది లైక్ చేశారు. అలాగే కామెంట్ల రూపంలో అనేక మంది వీరి ఆప్యాయతను కొనియాడుతూ బిలియనీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు.
టీనా అంబానీ గత నెల ముఖేశ్ -నీతూ అంబానీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగానూ ఓ ఫొటోను పంచుకున్నారు. అందులో అనిల్ అంబానీ దంపతులు, ముఖేశ్ దంపతులు కలిసి ఉన్నారు.