వెంకటేశ్ సినిమా ఓటీటీ ద్వారా రానుందా?
- సెకండ్ వేవ్ లో కరోనా విజృంభణ
- కలవరపరుస్తున్న కొత్త కేసుల సంఖ్య
- రెడీ అవుతున్న వెంకీ 'దృశ్యం 2'
- ఓటీటీ ద్వారా విడుదలకు యోచన
కరోనా కారణంగా గతేడాది అన్ని రంగాలలానే చిత్రపరిశ్రమ కూడా తీవ్రంగా నష్టపోయింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూసివేయడంతో విడుదలకు రెడీ అయిన సినిమాలు ఆగిపోవడం జరిగింది. అయితే, కొంతలో కొంత ఆ సమయంలో ఆయా నిర్మాతలను ఓటీటీ వేదికలు ఆదుకున్నాయి. విడుదలకు రెడీగా వున్న కొన్ని సినిమాల నిర్మాతలు ఆయా ఓటీటీ వేదికలతో ఒప్పందాలు కుదుర్చుకుని బయటపడ్డారు.
ఇక ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపుతోంది. ఫస్ట్ వేవ్ కంటే ఇప్పుడు దారుణంగా నమోదవుతున్న కేసుల సంఖ్య అందర్నీ కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో మళ్లీ లాక్ డౌన్ నాటి పరిస్థితులు తలెత్తుతాయేమోనని నిర్మాతలు భయపడుతున్నారు. మళ్లీ థియేటర్ల మూసివేత ఎదురవ్వచ్చని.. లేదా థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గిపోవచ్చనీ భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న 'దృశ్యం 2' చిత్రంపై కూడా తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీని మలయాళ మాతృక ఓటీటీలోనే రిలీజయింది. దీంతో ఈ తెలుగు వెర్షన్ ని కూడా అదే పద్ధతిలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతుందన్నది త్వరలోనే తెలుస్తుంది.