తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ప్ర‌మాణం చేస్తారా?: అచ్చెన్నాయుడు

  • తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించారు
  • టీడీపీ  గెలుస్తుందనే భ‌యంతోనే వైసీపీ అరాచకం
  • దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?
ఇటీవ‌ల జ‌రిగిన తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ దొంగ ఓట్లు వేయించింద‌ని తెలుగుదేశం పార్టీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, వాటిని వైసీపీ నేత‌లు తిప్పికొడుతున్నారు. దీనిపై అమ‌రావ‌తిలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... అసలు దొంగ ఓట్లే వేయించ‌లేద‌ని తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ప్ర‌మాణం చేస్తారా? అని స‌వాలు విసిరారు.

ఈ ఎన్నిక‌లో టీడీపీ గెలుస్తుందనే భ‌యంతోనే వైసీపీ అరాచకం సృష్టించిందని ఆయ‌న మండిప‌డ్డారు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని అరెస్ట్‌ చేయకుండా ఎందుకు వ‌దిలేశారటూ డీజీపీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


More Telugu News