మందుబాబుల ముందు చూపు.. ఢిల్లీలో లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న‌తో వైన్ షాపుల ముందు భారీ క్యూలు

  • కేజ్రీవాల్ లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న చేయ‌గానే వైన్ షాపుల‌కు ప‌రుగులు
  • అన్ని ప్రాంతాల్లోనూ ఇదే ప‌రిస్థితి
  • ఆరు రోజులకు స‌రిప‌డా మందు కొంటోన్న మందుబాబులు
ఢిల్లీలో క‌రోనా కేసులు పెరిగిపోతోన్న నేప‌థ్యంలో ఈ రోజు రాత్రి 10 గంట‌ల నుంచి వచ్చే సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌ వ‌ర‌కు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ ఆరు రోజుల లాక్‌డౌన్ లో గొంతులో చుక్క పడకపోతే ఎలా? అని మందుబాబులు తెగ బాధ‌ప‌డిపోతున్నారు. అందుకే, ముందుచూపుతో ఈ రోజులకు సరిపడా మందు కొనేసుకోవాలని వైన్ షాపుల ముందు భారీగా క్యూలు క‌డుతున్నారు.

గ‌త ఏడాది విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల మందు దొర‌క‌క‌పోవ‌డంతో మందుబాబులు అల్లాడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ సారి త‌మ‌కు ఆ ప‌రిస్థితి ఎదురు కాకుండా చూసుకుంటున్నారు. సీఎం కేజ్రీవాల్ అలా లాక్‌డౌన్ ప్ర‌క‌ట‌న చేసిందే ఆల‌స్యం.. ఇలా మందుబాబులు వైన్ షాపుల వ‌ద్ద‌కు ప‌రుగులు తీస్తూ వ‌చ్చేశారు.

కొంద‌రు ఆరు రోజుల‌కు సరిపడా మందును కొనుక్కుని వెళ్తున్నారు. త‌మను క‌రోనా నుంచి మందు కాపాడుతుంద‌ని కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం ఇక్కడ గ‌మ‌నార్హం. ఢిల్లీలో వైన్ షాపుల ముందు క్యూల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. గోల్ మార్కెట్ ప్రాంతంలో ఓ వైన్ షాపు ముందు వంద‌లాది మంది క్యూ కట్టడం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఢిల్లీలోని అన్ని వైన్ షాపుల ముందు భారీ క్యూలు క‌న‌ప‌డుతున్నాయి.


More Telugu News