దేశంలో కొత్తగా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,61,919
- మృతుల సంఖ్య 1,78,769
- 12,38,52,566 మందికి వ్యాక్సిన్లు
- మొత్తం 26,78,94,549 కరోనా పరీక్షలు
దేశంలో కరోనా కేసుల విజృంభణ తీవ్ర స్థాయికి చేరింది. నిన్న కొత్తగా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 1,44,178 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,61,919 కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 1,619 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,78,769 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,29,53,821 మంది కోలుకున్నారు. 19,29,329 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 12,38,52,566 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 26,78,94,549 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 13,56,133 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.