ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం...11 మంది దుర్మరణం
- కైరో నుంచి మన్సోరా వెళ్తున్న రైలు
- క్షతగాత్రుల్లో ఎక్కువ మంది చిన్నారులు
- గత నెలలో జరిగిన ప్రమాదంలో 32 మంది మృత్యువాత
ఈజిప్టులో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రాజధాని కైరో నుంచి బయలుదేరిన రైలు పట్టాలు తప్పిన ఘటనలో 11 మంది మృతి చెందగా, మరో 98 మంది గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి మన్సోరా వెళ్తున్న రైలు టోక్ అనే చిన్న పట్టణం వద్ద పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి.
గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సహాయక చర్యల్లో 50కిపైగా అంబులెన్స్‌లు పాలుపంచుకున్నట్టు పేర్కొంది. కాగా, క్షతగాత్రుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. తాజా ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, గత నెలల్లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మృతి చెందగా, 165 మంది గాయపడ్డారు.