ఓపెనర్ల దూకుడుతో భారీ స్కోరు సాధించిన పంజాబ్ కింగ్స్
- ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ పంజాబ్
- మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 రన్స్
- అర్ధసెంచరీలు సాధించిన మయాంక్, రాహుల్
ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ విజృంభణతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. మయాంక్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 69 పరుగులు చేయగా, రాహుల్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 61 పరుగులు సాధించాడు.
మిడిలార్డర్ లో దీపక్ హుడా (13 బంతుల్లో 22 నాటౌట్), షారుఖ్ ఖాన్ (5 బంతుల్లో 15) కూడా రాణించడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, లూక్మన్ మెరివాలా, రబాడా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.