కోహ్లీ సారథ్యంలో దూసుకుపోతున్న బెంగళూరు... ఐపీఎల్ లో హ్యాట్రిక్
- చెన్నైలో కోల్ కతాతో మ్యాచ్
- 38 పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు
- లక్ష్య ఛేదనలో కోల్ కతా 166-8
- కైల్ జేమీసన్ కు 3 వికెట్లు
విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 14వ సీజన్ లో వరుసగా మూడో విజయం సాధించింది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్ కతా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసింది.
ఆ జట్టులో ఆండ్రీ రస్సెల్ 31, కెప్టెన్ ఇయార్ మోర్గాన్ 29, రాహుల్ త్రిపాఠి 25, షకీబ్ అల్ హసన్ 26 పరుగులు చేశారు. ఐపీఎల్ లో భారీ ధర పలికిన బెంగళూరు ఆటగాడు కైల్ జేమీసన్ తన ఎంపికకు న్యాయం చేస్తూ 3 వికెట్లు తీశాడు. చహల్ కు 2, హర్షల్ పటేల్ కు 2 వికెట్లు దక్కాయి. వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ సాధించాడు.
కాగా, ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ విజయాలు సాధించి 6 పాయింట్లతో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.