ఐపీఎల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- ఐపీఎల్ లో ఈ సాయంత్రం ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్
- చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
- రజత్ పాటిదార్ ను జట్టులోకి తీసుకున్న ఆర్సీబీ
- ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న కేకేఆర్
చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు తానాడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఎదురులేని ఆర్సీబీ మూడో మ్యాచ్ లోనూ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది.
ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టులో డాన్ క్రిస్టియన్ స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చాడు. బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ మెరుగైన వనరులు ఉన్నాయి. షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో రాణిస్తుండడం ఆ జట్టుకు బోనస్ అని చెప్పాలి. కైల్ జేమీసన్, సిరాజ్, హర్షల్ పటేల్ లతో కూడిన పేస్ దళం, చహల్, అహ్మద్ ల స్పిన్ జోడీ ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేయగల సత్తా ఉన్నవాళ్లే.
అటు కోల్ కతా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ప్యాట్ కమిన్స్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ భారాన్ని మోస్తుండగా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ త్రయం తుది జట్టులో ఉండడం ఆసక్తి కలిగిస్తోంది.