కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాహుల్​ గాంధీ కీలక నిర్ణయం

  • బెంగాల్ ఎన్నికల ప్రచార సభలు రద్దు
  • మిగతావారూ తనలాగే చేయాలని సూచన
  • సభలతో తీవ్ర పరిణామాలని హెచ్చరిక
కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఇకపై ఎన్నికల ప్రచారం, ఎలాంటి సభలూ నిర్వహించబోనని ప్రకటించారు. మిగతా రాజకీయ నాయకులకూ ఇదే సూచన చేశారు.

మిగతా రాజకీయ నాయకులందరూ తనలాగే ఎన్నికల సభలను రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఇలాంటి సమయంలో పెద్ద పెద్ద సభలు పెట్టడం వల్ల ఎంతటి తీవ్ర పరిణామాలు ఉంటాయో బేరీజు వేసుకోవాలని పేర్కొన్నారు.

కాగా, బెంగాల్ లో చివరిగా ఈ నెల 14న రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు తమిళనాడులోనూ ప్రచారంలో పాల్గొన్నారు. పుదుచ్చేరి, అస్సాం, కేరళ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు.


More Telugu News