వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిన మీరాబాయి చాను!
- తాష్కెంట్ లో జరుగుతున్న వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
- 119 కిలోల బరువు ఎత్తిన మీరాబాయి
- ఓ స్వర్ణం, మరో కాంస్య పతకం కైవసం
తాష్కెంట్ లో జరుగుతున్న ఆసియా సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత క్రీడాకారిణి మీరాబాయి చానూ, వరల్డ్ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు క్లీన్ అంజర్క్ లో స్వర్ణంతో పాటు, ఓవరాల్ గా కాంస్య పతకం గెలుచుకుంది. ఇప్పటివరకూ చైనా క్రీడాకారిణి హుయ్ హువా జాయాంగ్ 118 కేజీలను ఎత్తగా, మీరాబాయి దాన్ని చెరిపేస్తూ, 119 కేజీల బరువు ఎత్తడం గమనార్హం.
ఆపై స్నాచ్ లో 86 కిలోలను ఎత్తిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, ఈ పోటీల్లో ఓవరాల్ గా ఒకే పతకం ఇవ్వకుండా, స్నాచ్, టోటల్, క్లీన్ అండ్ జర్క్ విభాగాలకు వేరువేరుగా పతకాలను ఇస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా మీరాబాయి 205 కిలోల బరువెత్తి ఈ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించింది.