నేరడి బ్యారేజి నిర్మాణంలో సహకరించండి: ఒడిశా ముఖ్యమంత్రికి సీఎం జగన్ లేఖ
- వంశధార నదిపై నేరడి ప్రాజెక్టు
- నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఉందన్న సీఎం జగన్
- సానుకూలంగా స్పందించాలని నవీన్ పట్నాయక్ కు విజ్ఞప్తి
- 80 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని ఆవేదన
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు నేరడి ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తమని, వంశధార నదిపై నిర్మించే ఆ ప్రాజెక్టుకు ఒడిశా సహకరించాలని ఏపీ సీఎం జగన్ ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. వంశధార నదీ వివాదాల ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం నేరడి బ్యారేజి నిర్మించుకునేందుకు అనుమతి ఉందని, దీనిపై సానుకూలంగా స్పందించాలని సీఎం జగన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు లేఖ రాశారు.
ఏపీ, ఒడిశా మధ్య ఉన్న జల ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా చూడాలని, ఇప్పటికే 80 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరడి బ్యారేజి నిర్మాణం జరిగితే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాతో పాటు ఒడిశాలోని గజపతి జిల్లాకు కూడా లబ్ది చేకూరుతుందని సీఎం జగన్ వివరించారు. ఈ ప్రాజెక్టు అంశంలో ఒడిశా ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.