తిరుపతిలో దొంగ ఓట్ల కలకలంపై స్పందించిన ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

తిరుపతిలో దొంగ ఓట్ల కలకలంపై స్పందించిన ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్
  • తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్  
  • తిరుపతిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని విపక్షాల ఆరోపణ
  • మీడియాలో వార్తలు ప్రసారం
  • కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షించిన విజయానంద్
తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు నమోదవుతున్నాయని విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ విజయానంద్ స్పందించారు. ఎవరైనా దొంగ ఓట్లు వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు తావివ్వని రీతిలో వ్యవహరించాలని చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు, ఎన్నికల అధికారులకు స్పష్టం చేశారు.

ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే... భారీగా బయటి వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై మీడియాలో వార్తలు ప్రసారం కావడంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విజయానంద్ స్పందించారు. సెక్రటేరియట్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి తిరుపతి పోలింగ్ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు.


More Telugu News