'ఆహా'లో అడుగుపెడుతున్న 'చావుకబురు చల్లగా'
- ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'చావుకబురు చల్లగా'
- ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన కథ
- కొత్త మార్పులతో 'ఆహా'కి తెస్తున్న అల్లు అరవింద్
కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా 'చావుకబురు చల్లగా' సినిమా రూపొందింది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొన్ని సీన్స్ బోర్ అనిపించాయనీ .. అక్కడక్కడా లాజిక్ మిస్సయిందనే టాక్ వచ్చింది.
దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నిడివి ఎక్కువవుతుందనే ఉద్దేశంతో కొన్ని సీన్స్ ను ఎడిట్ చేయడం వలన లాజిక్ మిస్ అయిందని చెప్పాడు. వీలైతే ఆ సీన్స్ ను యాడ్ చేస్తామని అన్నాడు. అది అప్పుడు కుదరలేదుగానీ, 'ఆహా' కోసం మాత్రం చేస్తున్నారు.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. దాంతో అల్లు అరవింద్ దగ్గర కూర్చుని మరీ కొని సీన్స్ ను ట్రిమ్ చేశారట. అలాగే లాజిక్ మిస్ అయిందనిపించిన చోటున ఆ సీన్స్ ను యాడ్ చేశారట. ఇక అనవసరం అనుకున్న కొన్ని సీన్స్ ను కూడా లేపేశారని అంటున్నారు. అంటే కొత్తగా మార్పులు చేసుకుని మరీ ఈ సినిమా 'ఆహా'లోకి అడుగుపెడుతోందన్న మాట. మరి ఇక్కడ ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో .. ఆకట్టుకుంటుందో .. ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి.