షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది: వైద్యులు
- ఇంటి వద్దే నిరాహారదీక్షను కొనసాగిస్తున్న షర్మిల
- భారీగా తరలివస్తున్న అభిమానులు, కార్యకర్తలు
- ఎవరూ రావద్దని కోరిన షర్మిల టీమ్
తెలంగాణ నిరుద్యోగుల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ వైయస్ షర్మిల మూడు రోజుల నిరాహారదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మొన్న ఆమె దీక్షను చేపట్టారు. అయితే ఒక్కరోజు మాత్రమే దీక్షకు అనుమతి ఉందంటూ పోలీసులు ఆమెను బలవంతంగా తరలించారు. ఈ సందర్భంగా ఆమె జాకెట్ కూడా చిరిగిపోయిన ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది.
మరోవైపు తన ఇంటి వద్ద నుంచే ఆమె నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. ఆమె దీక్ష మూడో రోజుకు చేరుకుంది. షర్మిల ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షించారు. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు.
మరోవైపు షర్మిలను కలవడానికి, ఆమె దీక్షకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వస్తున్నారు. దీంతో, ఎవరూ ఇక్కడకు రావద్దని షర్మిల టీమ్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. నేటితో షర్మిల తన దీక్షను ముగించే అవకాశం ఉంది.