సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • జర్నలిస్టుగా మారుతున్న రష్మిక! 
  • భారీ ఫైట్ చేస్తున్న రామ్ చరణ్
  • 'ఉప్పెన' కాంబోలో మరో సినిమా
*  రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక ఎంపిక దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఇందులో ఆమె జర్నలిస్టు పాత్రలో కనిపిస్తుందని సమాచారం.
*  కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం షూటింగ్ హైదరాబాదు శివారు కోకాపేటలో వేసిన సెట్స్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్, సోనూ సూద్ లపై భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో సిద్ధ అనే నక్సలైట్ పాత్రలో చరణ్ నటిస్తున్న సంగతి విదితమే.
*  బుచ్చిబాబు దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'ఉప్పెన' చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇందులో జంటగా నటించిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలకు మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్లో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఉప్పెన' చిత్ర నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ దీనిని కూడా నిర్మిస్తారు. దీనికి ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తాడట.


More Telugu News