ఐసీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా
- కరోనా ఉద్ధృతి నేపథ్యంలోనే
- పరీక్షలపై తుది నిర్ణయం జూన్‌లో
- ఇప్పటికే సీబీఎస్‌ఈ పది పరీక్షలు రద్దు
- పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అదే బాటలో
కరోనా విజృంభణ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో సీఐఎస్‌సీఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డు నిర్వహించే ఐసీఎస్‌ఈ (10వ తరగతి), ఐఎస్సీ (12వ తరగతి) వార్షిక పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ‘ద కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ)’ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. పరీక్షలపై తుది నిర్ణయాన్ని జూన్ తొలి వారంలో తీసుకుంటామని తెలిపింది.
ఇప్పటికే సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. 12వ తరగతి పరీక్షల్ని వాయిదా వేశారు. అలాగే తెలంగాణ సహా పలు రాష్ట్రాలు సైతం పదో తరగతి పరీక్షల్ని రద్దు చేయగా.. మిగతా పరీక్షల్ని వాయిదా వేశాయి.