పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

  • పవన్‌ కోసం ప్రార్థించిన సోము వీర్రాజు
  • ఈరోజు ఉదయం పవన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
  • ఫామ్‌హౌస్‌లో డాక్టర్‌ తంగెళ్ల సుమన్‌ ఆధ్వర్యంలో చికిత్స
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న పవన్‌
కరోనా బారినపడ్డ ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ త్వరగా కోలుకోవాలని టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం పవన్‌ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించారు. వీరితో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పవన్‌ ఆరోగ్యం వెంటనే కుదుటపడాలని ఆకాంక్షించారు. ఇటీవల సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌కు తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆయన తన ఫామ్‌హౌస్‌లో చికిత్స పొందుతున్నారు. ఖమ్మంకు చెందిన వైరల్‌ వ్యాధుల నిపుణుడు, కార్డియాలజిస్టు డాక్టర్‌ తంగెళ్ల సుమన్‌ ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. అయితే, తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవన్‌ తన అభిమానులకు తెలియజేశారు.


More Telugu News