రాజధానిగా మారుతున్నందున విశాఖను స్లమ్స్ లేని నగరంగా తీర్చిదిద్దుతాం: విజయసాయిరెడ్డి
- భీమిలి 6 లైన్ల రోడ్డు, భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంకుస్థాపన చేస్తారు
- ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తాం
- సభ మీద గులకరాయి వేయించుకుని చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారు
త్వరలోనే ఏపీ రాజధానిగా విశాఖ అవతరించబోతోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖను అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. విశాఖలో 740 స్లమ్ ఏరియాలు ఉన్నాయని... నగరం రాజధానిగా మారనున్నందున స్లమ్స్ లేని సిటీగా విశాఖను మార్చుతామని చెప్పారు. భీమిలి 6 లైన్ల రోడ్డుకు, భోగాపురం ఎయిర్ పోర్ట్ కు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
త్వరలోనే ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తామని విజయసాయి చెప్పారు. ఈ జాబ్ మేళా ద్వారా 4 వేల మందికి ఉద్యోగావకాశాలను కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీకి టీడీపీ, జనసేన, బీజేపీ పోటీనే కాదని చెప్పారు. చిన్న గులకరాయిని తన సభ మీద వేయించుకుని చంద్రబాబు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఏదైనా చేయించుకోగలరని విమర్శించారు. 17వ తేదీ తర్వాత తమ పార్టీ ఉండదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు చెప్పారని... అచ్చెన్న వ్యాఖ్యలతో టీడీపీ భవిష్యత్తు ఏమిటో అర్థమవుతోందని అన్నారు.