‘అశోకవనంలో అర్జున కల్యాణం’లో విష్వక్‌సేన్‌

  • ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్‌ లతో ఫేమ్‌ సంపాదించిన విష్వక్  ‌
  • ప్రస్తుతం 'పాగల్'‌లో నటిస్తున్న యువహీరో
  • బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో కొత్త సినిమా
  • దర్శకుడిగా పరిచయం కానున్న విద్యాసాగర్‌ చింతా
ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్‌, హిట్‌ వంటి చిత్రాలతో యువతలో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విష్వక్‌సేన్‌ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్‌ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్‌ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విద్యాసాగర్‌ చింతా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాకు ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ అనే వెరైటీ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రంలో అర్జున పాత్రలో విష్వక్ కనిపించనున్నారు. ఈ సినిమాకు రవికిరణ్‌ కోలా కథ సిద్ధం చేయగా.. జయకృష్ణ సంగీతం అందిస్తున్నారు. విప్లవ్‌ ఎడిటింగ్‌ చేయనున్నారు. ఈ సినిమా ఒక లవ్‌ ఎంటర్‌టైనర్‌ అని చిత్ర వర్గాలు తెలిపాయి.

త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి నేడు ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. విష్వక్‌ తల్లి దుర్గ హీరోపై తొలి క్లాప్‌ కొట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌ సహా ఇతర టెక్నిషీయన్లకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది. మరోపక్క, విష్వక్‌సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’ చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటోంది. ‌


More Telugu News