తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదు: విష్ణువర్ధన్ రెడ్డి
- వైసీపీ ఆగడాలపై ప్రజలు తిరగబడాలి
- పోలీసులకు, అధికారులకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు
- వైసీపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం
వైసీపీపై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక స్వేచ్ఛగా జరిగే పరిస్థితి లేదని ఆరోపించారు. అధికార పార్టీ ఆగడాలపై ప్రజలు తిరగబడాలని ఆయన అన్నారు.
అలాగే, వాలంటీర్లకు, పోలీసులకు, అధికారులకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల అధికార దుర్వినియోగంపై తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తించిన వైసీపీ అడ్డదారుల్లో ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు గుప్పించారు.