టీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా పాజిటివ్!
- ట్వీట్ చేసిన కేశినేని నాని
- ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని వ్యాఖ్య
- కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్, సుర్జేవాలాకు కరోనా
దేశంలో కరోనా ఇప్పుడు మళ్లీ విశ్వరూపాన్ని చూపుతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ప్రముఖులను కూడా వదలడం లేదు. తాజాగా పలువురు రాజకీయ నేతలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. టీడీపీ ఎంపీ కేశినేని నానికి కూడా కరోనా సోకింది.
'స్వల్ప లక్షణాలతో నాకు ఈ రోజు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ మధ్య నన్ను కలిసిన వారు ఐసోలేషన్‌లో ఉండండి.. కరోనా పరీక్ష చేయించుకోండి' అని కేశినేని నాని ట్వీట్ చేశారు.
మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, రణ్‌దీప్ సుర్జేవాలాకు కూడా కరోనా సోకింది. కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయిందని, దీంతో ఢిల్లీలోని తన నివాసంలో క్వారంటైన్‌లో ఉన్నానని దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. తాను ఈ రోజు ఉదయం పరీక్ష చేయించుకోగా కరోనా ఉన్నట్లు తేలిందని రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. గత ఐదు రోజుల వ్యవధిలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని రణ్‌దీప్ సుర్జేవాలా సూచించారు.