పట్టువీడని షర్మిల.. యువతకు ఉద్యోగాల కోసం కొనసాగుతోన్న నిరాహార దీక్ష
- నిన్న ఉదయం ఇందిరా పార్క్ వద్ద దీక్ష ప్రారంభం
- 72 గంటల నిరాహార దీక్షను చేస్తానని ప్రకటన
- పలు సంఘాల నేతల మద్దతు
తెలంగాణ యువతకు ఉద్యోగాల కోసం వైఎస్ షర్మిల నిన్న ఉదయం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆమె దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో నిన్న సాయంత్రం నుంచి ఆమె లోటస్‌పాండ్‌లో దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె వద్దకు పలు సంఘాల నేతలు వచ్చి మద్దతు తెలుపుతున్నారు.
మరోపక్క షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాను ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఇప్పటికే షర్మిల స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారి తరఫున తాను పోరాడతానని ఆమె చెప్పారు. కాగా, ఈ ఏడాది జులై 8న తెలంగాణలో ఆమె పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. అదే రోజున తెలంగాణలో పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు.