మరోసారి ప్రేక్షకులను అలరించనున్న రామాయణం సీరియల్!
- 1987-88 సంవత్సరాల్లో ప్రసారమైన రామాయణం
- గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో మళ్లీ ప్రసారం
- త్వరలో స్టార్ భారత్‌లో ప్రసారం
సీతారాముల గాథ రామాయణం ఎన్ని సార్లు విన్నా మరోసారి వినాలనిపిస్తుంది. టీవీల్లో ఎన్ని సార్లు చూసినా మరోసారి చూడాలనిపిస్తుంది. 1987-88 సంవత్సరాల్లో ప్రసారమైన రామానంద్ సాగర్ సీరియల్ రామాయణాన్ని గత ఏడాది కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో మళ్లీ ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
ఆ సీరియల్ భారతీయ టెలివిజన్ చరిత్రలో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి రామాయణం సీరియల్ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని సీరియల్ లో సీత పాత్ర పోషించిన దీపికా చిక్లియా తెలిపింది. గత ఏడాది లాక్‌డౌన్ వేళ సీరియల్ ప్రసారమైందని ఆమె గుర్తు చేసింది. చరిత్ర మళ్లీ పునరావృతం అవుతున్నట్లు అనిపిస్తోందని చెప్పింది. ఈ సీరియల్‌లో అరుణ్ గోవిల్ రాముడి పాత్రను పోషించారు. త్వరలో స్టార్ భారత్‌లో సాయంత్రం సమయంలో ఇది ప్రసారం కానుంది.