బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిల్చిన 'కర్ణన్'
- విభిన్నమైన కథాంశంతో వచ్చిన 'కర్ణన్'
- విడుదలైన రోజు నుంచి విజయవిహారం
- తొలి ఐదు రోజుల్లో 40 కోట్లకి పైగా గ్రాస్
కోలీవుడ్ కథానాయకులలో కొత్తదనం కోసం తపించేవారి జాబితాలో ధనుశ్ ఒకరిగా కనిపిస్తాడు. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ఆయన ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన కెరియర్ ను పరిశీలిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఇక ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'కర్ణన్' వచ్చింది. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన రెండవ రోజు నుంచే అక్కడ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమల్లోకి వచ్చింది. అయినా తొలిరోజునే హిట్ టాక్ రావడంతో, థియేటర్లకు జనం పోటెత్తుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లోను ఈ సినిమా తొలి 5 రోజుల్లో 40 కోట్లకి పైగా గ్రాస్ ను సాధించడం విశేషం. 100 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్టయితే ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కర్ణుడు స్నేహం కోసం ప్రాణం ఇచ్చాడు .. ఈ కర్ణుడు తనని నమ్మినవారి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక నిలబడతాడు. పెద్దవాళ్లమనీ .. పెత్తందారులమని చెప్పుకునే వాళ్లను ఆయన ఎదిరించే విధానమే ఇందులో కొత్తగా ఉంటుంది. అదే ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది. ఈ సినిమాలో ధనుశ్ సరసన రజీషా విజయన్ ఆకట్టుకుంది.