సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా?: పొన్నాల ల‌క్ష్మ‌య్య‌

  • కేసీఆర్‌కు ఏడేళ్లుగా నాగార్జున సాగ‌ర్ స్థానం గుర్తుకురాలేదు
  • ఉప ఎన్నిక  ఉంది కాబ‌ట్టి వ‌రాల‌జ‌ల్లు
  • అన్ని విష‌యాల్లోనూ అస‌త్యాలు చెబుతారు
తెలంగాణ‌లోని నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ప్ర‌చారానికి మ‌రికొన్ని గంట‌ల్లో ప్ర‌చారం ముగియ‌నుండ‌డంతో ఈ రోజు నేత‌లు జోరుగా ప్ర‌చారాలు, మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పొన్నాల ల‌క్ష్మ‌య్య మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఆయ‌న‌కు ఏడేళ్లుగా సాగర్‌ నియోజకవర్గం గుర్తుకురాలేద‌ని, ఇప్పుడు ఉప ఎన్నిక  ఉంది కాబ‌ట్టి ఆ నియోజ‌క వ‌ర్గంపై వరాల జల్లు కురిపిస్తున్నారని విమర్శించారు. ఆయ‌న‌ అన్ని విష‌యాల్లోనూ అస‌త్యాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. త‌మ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ‌ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా? అని ఆయ‌న ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టులపై నిపుణులతో చర్చకు రావాలని కేసీఆర్‌కు పొన్నాల స‌వాలు విసిరారు.


More Telugu News