రాజ్యాంగాన్ని, రైతులను కాపాడాలి: రాకేశ్ తికాయత్
- రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
- ప్రైవేటు సంస్థల గురించే ఆలోచిస్తోంది
- కంపెనీల చేతిలో ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తోన్న ఆందోళన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని, రైతులను కాపాడాలని అన్నారు.
రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రైవేటు సంస్థల గురించే ఆలోచిస్తోందని, ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో కాకుండా కంపెనీల చేతిలో నడుస్తోందని ఆయన విమర్శించారు. దేశాన్నిఆ సంస్థల నుంచి రక్షించుకోవాల్సింది ప్రజలేనని తెలిపారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతో పలు ప్రైవేటు సంస్థలు రైతుల భూములపై కన్ను వేశాయని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని ఆయా కంపెనీలకు అమ్ముతోందని రాకేశ్ తికాయత్ మండిపడ్డారు. రైతులకు మద్దతు తెలుపుతోన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. విభజించు, పాలించు విధానంలో ముందుకు వెళ్తున్న కేంద్ర సర్కారు విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
నియంతలా వ్యవహరిస్తున్న సర్కారుకి దీటుగా బదులివ్వాలని ఆయన అన్నారు. కాగా, తాము కేంద్ర ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమని రైతులు ఇప్పటికే ప్రకటించారు. అయితే, వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేసుకోవాలని అన్నారు.