ఆసుపత్రిలో బెడ్ ఇవ్వండి.. లేదా అతన్ని చంపేయండి: కరోనా పేషెంట్ కుమారుడి ఆవేదన
- ఆసుపత్రుల్లో బెడ్ దొరక్కపోవడంతో అంబులెన్సులోనే పేషెంట్
- తెలంగాణలో ప్రయత్నించినా లభించని బెడ్
- అంబులెన్సులో అయిపోతున్న ఆక్సిజన్
మహారాష్ట్ర చంద్రపూర్ కు (ముంబైకి 850 కి.మీ. దూరం) చెందిన సాగర్ కిశోర్ నహర్ హెతివార్ అనే వ్యక్తి చేసిన ఒక హృదయ విదారకమైన విన్నపం అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది. కరోనాతో బాధపడుతున్న తన తండ్రిని రక్షించుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు.
దీంతో.. 'హాస్పిటల్ లో బెడ్ ఇవ్వండి... లేదా ఆయనను చంపేయండి' అంటూ కంటతడి పెట్టుకున్నాడు. కరోనా బారిన పడిన ఆయన తండ్రి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే, ఆసుపత్రుల్లో బెడ్లు లేకపోవడంతో... ఆయన హాస్పిటల్ లో చేరలేకపోయారు. బెడ్ కోసం ఆయన కుమారుడు అన్ని ఆసుపత్రులను సంప్రదించినా ఉపయోగం లేకపోయింది.
తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించేందుకు సాగర్ కిశోర్ ఎంతో శ్రమించాడు. చంద్రపూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆసుపత్రులన్నీ పేషెంట్లతో కిక్కిరిసిపోయాయి. వృద్ధులైన పేషెంట్లు ఎంతో మంది ఆసుపత్రుల ఎదుట అంబులెన్సుల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించేందుకు సాగర్ కిశోర్ అన్ని ఆసుపత్రులు తిరిగాడు. బెడ్ దొరక్కపోవడంతో... నిన్న రాత్రి 3 గంటలకు తెలంగాణకు చేరుకుని బెడ్ కోసం ప్రయత్నించారు. ఇక్కడ కూడా బెడ్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రెండు రాష్ట్రాల్లో కూడా వారికి బెడ్ దొరకకపోవడంతో... ప్రస్తుతం ఆయన తండ్రి ఒక అంబులెన్సులో ఉన్నారు. అంబులెన్సులోనే దగ్గుతూ పడుకున్నారు.
మరోవైపు అంబులెన్సులో అతని తండ్రికి అమర్చిన ఆక్సిజన్ అయిపోతోంది. దీంతో, తన తండ్రికి బెడ్ ఇవ్వండి... లేదా ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి ఆయనను చంపేయండని నాగర్ కిశోర్ కంటతడి పెట్టాడు. మీరు బెడ్ ఇచ్చి చికిత్స అందించండి... లేకపోతే తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లబోనని చెప్పాడు.