మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతికి డబుల్ మ్యుటేషనే కారణమా?

  • 361 నమూనాల విశ్లేషణ
  • 61 శాతం నమూనాల్లో డబుల్ మ్యుటేషన్
  • వైరస్ విజృంభణను అంచనా వేసేందుకు జినోమ్ సీక్వెన్సింగ్
  • ల్యాబొరేటరీల తీరుపై జినోమ్ సీక్వెన్సింగ్
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణకు డబుల్ మ్యుటేషనే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ మహమ్మారి బారినపడుతున్న వారి నమూనాలను పరీక్షించగా, 61 శాతం మందిలో డబుల్ మ్యుటేషన్ బయటపడినట్టు వైరాలజీ నిపుణులు పేర్కొన్నారు.

దేశంలో వైరస్ విజృంభణను అంచనా వేసేందుకు పాజిటివ్ రోగుల నమూనాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వరంలో ఎప్పటికప్పుడు జినోమ్ సీక్వెన్సింగ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలో జనవరి, మార్చి నెలల మధ్య 361 కరోనా నమూనాలను విశ్లేషించారు. వీటిలో 61 శాతం శాంపిళ్లలో డబుల్ మ్యుటేషన్లు బయటపడ్డాయి.

అయితే, రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి డబుల్ మ్యుటేషనే కారణమని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిన నమూనాల ఫలితాలను ల్యాబొరేటరీలు వెల్లడించడం లేదని, కాబట్టి వైరస్ మ్యుటేషన్లను తెలుసుకోవడం ఇబ్బందిగా మారిందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వైరస్ రకం ఎంత ప్రమాదకరమైనదో తెలిస్తే ప్రజలను అంతగా అప్రమత్తం చేసే వీలుంటుందని అంటున్నారు.


More Telugu News