అకాలీదళ్‌ అధికారంలోకి వస్తే పంజాబ్‌లో దళిత వ్యక్తికే ఉపముఖ్యమంత్రి పదవి!: సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ హామీ

  • అంబేద్కర్‌ పేరుతో విశ్వవిద్యాలయం
  • కొట్టిపారేసిన ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌
  • ఎన్నికల గిమ్మిక్కుగా అభివర్ణన
వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే దళితుణ్ని ఉప ముఖ్యమంత్రి చేస్తామని శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ హామీ ఇచ్చారు. అలాగే దళిత జనాభా అధికంగా ఉండే దవోబా ప్రాంతంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్  పేరుమీద ఓ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని ప్రకటించారు.  నేడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన ఈ హామీలు ప్రకటించారు. తమ పార్టీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని.. అందుకు తాను గర్విస్తున్నానని సుఖ్‌బీర్‌ సింగ్‌ అన్నారు.

దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ స్పందిస్తూ.. సుఖ్‌బీర్‌ సింగ్‌ ప్రకటనను ఎన్నికల గిమ్మిక్కుగా కొట్టిపారేశారు. తమ 10 ఏళ్ల పాలనా కాలంలో దళిత సామాజిక వర్గానికి అకాలీదళ్‌ ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. పంజాబ్‌లో మొత్తం జనాభాలో దళితుల వాటా 33 శాతం.


More Telugu News