రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

  • సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు
  • విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలు బంద్‌
  • వివాహాల్లో 50 మందికి అనుమతి
  • 10, 12వ తరగతి వార్షిక పరీక్షల రద్దు
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా రాజస్థాన్‌ సైతం చేరింది. మహమ్మారి కట్టడికి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది.

అలాగే, సాయంత్రం ఐదు గంటలకే అన్ని మార్కెట్లు మూసివేయడం, విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలను మూసి ఉంచడం వంటి నిబంధనలు సైతం అమల్లో ఉండనున్నాయి. బహిరంగ సభలు, క్రీడా కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వివాహాలకు కేవలం 50 మందినే అనుమతించనున్నారు. మహమ్మారి ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే 10, 12వ తరగతి వార్షిక పరీక్షల్ని రద్దు చేశారు.

రాజస్థాన్‌లో మంగళవారం 6,200 కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఒక్క జైపుర్‌లోనే 1,325 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 40 వేల క్రియాశీలక కేసులు ఉన్నాయి.


More Telugu News