'విరాటపర్వం' రిలీజ్ వాయిదా .. అధికారిక ప్రకటన!

  • రానా నుంచి రానున్న 'విరాటపర్వం'
  • కరోనా కారణంగా వెనక్కి
  • త్వరలో కొత్త విడుదల తేదీ  
రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' రూపొందింది. సురేశ్ బాబు .. సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది. ఈ సినిమా నుంచి వదిలిన ప్రతి అప్ డేట్ అభిమానుల్లో అంచనాలను పెంచుతూ వచ్చింది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నట్టు చాలా రోజుల క్రితమే చెప్పారు.  రానా అభిమానులంతా ఆ రోజు కోసం ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.


కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో .. దాని ప్రభావం తీవ్రంగా ఉండటంతో చాలా సినిమాలు వెనక్కి వెళుతున్నాయి. అలా థియేటర్లకు దూరంగా వెళుతున్న సినిమాల జాబితాలో తాజాగా 'విరాటపర్వం' కూడా చేరిపోయింది. పెరుగుతున్న కరోనా తీవ్రత .. మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్టుగా మేకర్స్  అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేశారు. కొత్త విడుదల తేదీ ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తామని అన్నారు. ఇటు రానా అభిమానులకు .. అటు సాయి పల్లవి ఫ్యాన్స్ కి ఇది నిరాశను కలిగించే విషయమే!


More Telugu News